ఈ ఏడాది పాపులర్‌ అయ్యింది..

ABN , First Publish Date - 2020-12-27T18:53:13+05:30 IST

సోషల్‌ మీడియాలో 2020లో బాగా పాపులర్‌ అయిన వంటకం క్లౌడ్‌ బ్రెడ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో కాలం ట్రెండిగ్‌గా నిలిచింది.

ఈ ఏడాది పాపులర్‌ అయ్యింది..

సోషల్‌ మీడియాలో 2020లో బాగా పాపులర్‌ అయిన వంటకం క్లౌడ్‌ బ్రెడ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో కాలం ట్రెండిగ్‌గా నిలిచింది. టిక్‌టాక్‌లో కూడా పాపులర్‌ అయింది. పైన గోధుమ రంగులో, లోపల తెల్లగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే బన్ను గురించి మనందరికీ తెలుసు. చాయ్‌లో బన్ను అద్దుకుంటూ తినడం చాలా మందికి ఇష్టమైన వ్యాపకం. కానీ క్లౌడ్‌ బన్నేంటి?


సాధారణంగా బ్రెడ్డు తెల్లగా ఉంటుంది. కానీ ఇది మాత్రం నీలం, ఊదా, గులాబీ రంగుల్లో ఉంటుంది. లోపల మేఘాల్లా కన్పిస్తుందనే వెరైటీగా ఆ పేరు పెట్టారు. అందుకే క్లౌడ్‌ బ్రెడ్‌ను చూడగానే తినొచ్చా అనే సందేహం వస్తుంది. పైకి ఫ్యాన్సీగా అన్పించినా సాధారణ బన్నులో ఉండే పదార్థాలతోనే దీన్ని తయారుచేస్తారు. కోడిగుడ్డు తెల్లసొన, చక్కెర, మొక్క జొన్నపిండి, ఫుడ్‌ కలర్‌ (మేఘాల ఎఫెక్ట్‌ కోసం)... ఈ నాలుగు ఉంటే చాలు క్లౌడ్‌ బ్రెడ్‌ రెడీ. ముందుగా ఎగ్‌ వైట్స్‌ను గిలక్కొట్టాలి. దీనికి చక్కెర, మొక్కజొన్నపిండిని కలపాలి. మీ అభిరుచికి తగిన ఫుడ్‌ కలర్‌ను చేర్చి బేక్‌ చేస్తే క్లౌడ్‌ బ్రెడ్‌ రెడీ. అవసరమైతే వంట సోడా కలపండి. కొంతమంది రెండు మూడు రంగుల్ని కలుపుతూ బ్రెడ్‌ తీరునే మారుస్తున్నారు. ఈ బ్రెడ్‌ను తింటుంటే వచ్చే మజానే వేరు. అందుకే సోషల్‌ మీడియాను బాగా ఊపేసింది ఈ మేఘాల్లాంటి బన్ను.

Updated Date - 2020-12-27T18:53:13+05:30 IST