రాఖీకి సోదరులకు రాఖీలతో పాటు మాస్కులు
ABN , First Publish Date - 2020-07-27T17:46:15+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపధ్యంలో పండుగలు, వేడుకలు మొదలైనవాటిని ఇళ్లలోనే చేసుకోవాల్సివస్తోంది. ఈసారి ఆగస్టు 3న రక్షాబంధన్ పండుగ వినూత్నంగా...

పట్నా: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపధ్యంలో పండుగలు, వేడుకలు మొదలైనవాటిని ఇళ్లలోనే చేసుకోవాల్సివస్తోంది. ఈసారి ఆగస్టు 3న రక్షాబంధన్ పండుగ వినూత్నంగా జరగనుంది. కరోనా వైరస్ ప్రభలుతున్న నేపధ్యంలో ప్రయాణం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సూచనను అమలు చేస్తూ బీహార్‌లోని సాసారాంనకు చెందిన సోదరీమణులు తమ సోదరులకు రాఖీతో మాస్కులు కూడా పంపిస్తున్నారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. అటువంటి పరిస్థితిలో సోదరీమణులు కొరియర్ ద్వారా తమ సోదరులకు రాఖీలను పంపుతున్నారు. సాసారాంనకు చెందిన సోదరీమణులు వైష్ణవి, శృంఖలలు కవరులో రాఖీతో పాటు మాస్కులను పెట్టి, సోదరులకు కొరియర్ చేయనున్నట్లు తెలిపారు.