రికార్డులు సృష్టిస్తున్న ‘సింగిల్ మదర్’
ABN , First Publish Date - 2020-03-02T18:04:48+05:30 IST
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని నాలాసోపారా ప్రాంతంలో ఉంటున్న సీమా వర్మ ‘సింగిల్ మదర్స్’కు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకుంటున్నారు.

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని నాలాసోపారా ప్రాంతంలో ఉంటున్న సీమా వర్మ ‘సింగిల్ మదర్స్’కు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సీమా తన పిల్లలకు పూర్తి సంరక్షకురాలిగా ఉంటూ ‘సింగిల్ మదర్‘గా గుర్తింపు పొందారు. 38 ఏళ్ల సీమా తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. పెళ్లాయ్యాక అత్తవారింట అనేక కష్టాలను చవిచూశారు. చివరికి పనిమనిషిగా కొన్ని ఇళ్లలో పనిచేస్తూ కాలం గడిపారు. ఈ నేపధ్యంలో ‘మేమ్‌సాహిబ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు అండగా నిలిచింది. దీంతో రన్నర్‌గా మారిన సీమా పలు పోటీల్లో పాల్గొని బహమతులు గెలుచుకున్నారు. ఆమెకు 19 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ సందర్భంగా సీమా మాట్లాడుతూ ఇప్పటి వరకూ పలు రేసుల్లో పాల్గొని 14 రేసుల్లో విజయం సాధించానని అన్నారు. ఫలితంగా రూ. 2 లక్షల వరకూ సంపాదించగలిగానని, పనిమనిషిగా సంపాదించిన దానికన్నా ఇది పెద్ద మొత్తమేనని అన్నారు. 17 ఏళ్లకే సీమాకు వివాహం కాగా, నాలుగేళ్ల తరువాత భర్త ఆమెను విడిచిపెట్టాడు. దీంతో ఆమె ‘సింగిల్ మదర్’గా జీవితాన్ని గడుపుతున్నారు.