‘కరోనా టెక్స్‌టైల్స్’... దూరం నుంచే ఎగబడుతున్న జనం!

ABN , First Publish Date - 2020-03-18T17:13:25+05:30 IST

కేరళలోని కొచ్చికి 40 కిలోమీటర్ల దూరంలో గల ఒక గ్రామంలో కరోనా టెక్స్‌టైల్స్ పేరుతో ఒక దుకాణం ఉంది. ఇప్పుడు ఈ దుకాణం చర్చనీయాంశంగా మారింది. ఈ దుకాణానికి గల పేరే ఇందుకు కారణం. ఈ మధ్యకాలంలో ఈ దుకాణానికి...

‘కరోనా టెక్స్‌టైల్స్’... దూరం నుంచే ఎగబడుతున్న జనం!

కొచ్చి: కేరళలోని కొచ్చికి 40 కిలోమీటర్ల దూరంలో గల ఒక గ్రామంలో కరోనా టెక్స్‌టైల్స్ పేరుతో ఒక దుకాణం ఉంది. ఇప్పుడు ఈ దుకాణం చర్చనీయాంశంగా మారింది. ఈ దుకాణానికి గల పేరే ఇందుకు కారణం. ఈ మధ్యకాలంలో ఈ దుకాణానికి జనం తండోపతండాలుగా తరలివచ్చి, అల్లంత దూరాన నిలుచుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంతేకాదు ఇక్కడికి వచ్చినవారంతా ఆ దుకాణం యజమాని ముఖం చూడాలని తహతహలాడిపోతున్నారు. ఈ సందర్భంగా దుకాణం యజమాని పారీద్ మాట్లాడుతూ తన దుకాణానికి వినూత్నమైన పేరు పెట్టేందుకు నిఘంటువును వెతికానని, అయితే ఇప్పుడు అది ఒక వ్యాధి పేరుగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని అన్నారు. ఇప్పుడు చాలామంది దుకాణం ముందు నిలుచుని సెల్ఫీలు తీసుకుంటున్నారని, తన ముఖాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పారు. కాగా కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి దుకాణానికి వచ్చేవారికి హ్యాండ్ శానిటైజర్ ఇస్తున్నానని తెలిపారు.

Updated Date - 2020-03-18T17:13:25+05:30 IST