తేలికపాటి ఇన్ఫెక్షన్ సోకిన వారిలో దీర్ఘకాలిక రోగ నిరోధకత
ABN , First Publish Date - 2020-12-29T09:13:38+05:30 IST
తేలికపాటి ఇన్ఫెక్షన్ సోకిన వారిలో దీర్ఘకాలిక రోగ నిరోధకత
లండన్, డిసెంబరు 28: లక్షణాలు బయటపడని, తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక ప్రతిస్పందన దీర్ఘకాలం ఉంటుందని యూకేలోని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మార్చి నెలలో కొవిడ్ బారినపడిన 136 మంది ఆరోగ్య కార్యకర్తల్లో యాంటీబాడీ లు, టీ-సెల్స్ ప్రతిస్పందనల కాలాన్ని తెలుసుకునేందుకు జరిపిన అధ్యయనంలో దీన్నిగుర్తించారు. 89ు మందిలో 4 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు, టీ-సెల్స్ క్రియాశీలంగా ఉన్నట్లు తెలిపారు. టీ-సెల్స్ చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.