చీరవిప్పి బాలుడిని కాపాడింది!

ABN , First Publish Date - 2020-09-12T08:00:53+05:30 IST

కాలువలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడేందుకు ఓ మహిళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

చీరవిప్పి బాలుడిని కాపాడింది!

 కాలువలో కొట్టుకుపోతున్న చిన్నారిని రక్షించిన మహిళ

బెంగళూరు, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి): కాలువలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడేందుకు ఓ మహిళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాను కట్టుకున్న చీర విప్పి దాని సాయంతో చిన్నారిని ఒడ్డుకు చేర్చింది.  కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎడమకాలువ సమీపంలో శుక్రవారం ఆరేళ్ల అరుణ దొడమని ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు. అక్కడే బట్టలు ఉతుకుతున్న షకీనాబేగం రజాసాబ అనే మహిళ గమనించి కేకలు వేసింది. మహేష్‌ గాళప్పగోళ అక్కడకు వచ్చినా ఈత రాకపోవడంతో అశక్తత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో షకీనాబేగం తను కట్టుకున్న చీరను విప్పి ఉపాధ్యాయుడికి ఇవ్వడంతో ఆయన దాని సాయంతో బాలుడిని చాకచక్యంగా గట్టుకు చేర్చారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

Updated Date - 2020-09-12T08:00:53+05:30 IST