వైరల్ వీడియో: కరోనా కాలంలో వణ్యప్రాణి విలువైన సందేశం

ABN , First Publish Date - 2020-05-13T23:43:53+05:30 IST

ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో ఉంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఇక అంతే సంగతులన్నట్టు అందరూ భయం భయంగా కాలం గడుపుతున్నారు.

వైరల్ వీడియో: కరోనా కాలంలో వణ్యప్రాణి విలువైన సందేశం

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో ఉంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఇక అంతే సంగతులన్నట్టు అందరూ భయం భయంగా కాలం గడుపుతున్నారు. దానిపై పోరాటంలో భాగంగా..  ‘ఇంటి దగ్గరే ఉండండి.. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయండి’ అనే నినాదం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇసుక నేలల్లో సంచరించే రక్తపింజరికి సంబంధించిన వీడియో అది. రక్తపింజరి.. మెల్ల మెల్లగా తన శరీరాన్ని ఇసుక లోపలికి తీసుకు వెళుతుండగా... వీడియో తీశారు. ఇది ఇసుకలోకి పూర్తిగా కూరుకుపోయినా... సంచరించడాన్ని ఆపదు. తన ప్రయాణాన్ని అలాగే కొనసాగించడం దీని విశిష్టత. 


ప్రవీణ్ కాశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా... ‘స్టే ఎట్ హోమ్’ గురించి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో మరోసారి తన ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశారు. జేవియర్ అజర్ అనే వ్యక్తి దీన్ని చిత్రీకరించగా... దాన్ని తను షేర్ చేసినట్టు ఆయన తెలిపారు. అంతేగాక #StayHomeను కూడా జత చేశారు. ప్రవీణ్ గత కొంతకాలంగా వన్య ప్రాణులకు సంబంధించిన రకరకాల ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ వస్తున్నారు.  #StayHomeపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూడ్డానికి కాస్త భయం గొలుపుతున్నా... నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.Read more