జీతం బకాయిలు అడిగిందని కుక్కను వదిలింది...

ABN , First Publish Date - 2020-07-08T19:20:19+05:30 IST

జీతం బకాయిలు ఇవ్వమని అడిగిందని బ్యూటీపార్లర్ యజమానురాలు ఉద్యోగినిపై పెంపుడు కుక్కను వదిలిన దారుణ ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.....

జీతం బకాయిలు అడిగిందని కుక్కను వదిలింది...

న్యూఢిల్లీ : జీతం బకాయిలు ఇవ్వమని అడిగిందని బ్యూటీపార్లర్ యజమానురాలు ఉద్యోగినిపై పెంపుడు కుక్కను వదిలిన దారుణ ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్ ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌లో సప్నా (39) అనే మహిళ మార్చి 22న లాక్‌డౌన్ విధించడానికి ముందు నెలన్నర రోజులు పనిచేసింది. తాను పనిచేసిన రోజులకు జీతం బకాయిలు ఇవ్వాలని సప్నా బ్యూటీ పార్లర్ యజమానురాలు రజనీని కోరింది. జీతం ఇస్తామని చెప్పి రజనీ ఖిర్కీ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలోని తన ఇంటికి రావాలని సప్నాకు సమాధానం ఇచ్చింది. జీతం డబ్బుల కోసం ఇంటికి వచ్చిన సప్నాకు ఇంట్లో పనిచేయాలని రజనీ కోరింది. ఇంట్లో పనిచేసేందుకు సప్నా నిరాకరించడంతో కోపంతో రజనీ తన పెంపుడు కుక్కను వదిలింది. కుక్క దాడి చేసి కరవడంతో సప్నాకు ముఖం, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలైన సప్నా మదన్ మోహన్ మాలవీయ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి నుంచి సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. సప్నాకు 15 కుట్లు పడ్డాయి. బాధితురాలి ఫిర్యాదు మేర తాము రజనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ చెప్పారు. 

Updated Date - 2020-07-08T19:20:19+05:30 IST