కరోనా టెస్టు చేయించుకోవాలని.. 160 కీమీల వేగంతో కారు తోలి..

ABN , First Publish Date - 2020-04-02T01:36:43+05:30 IST

ఆస్ట్రేలియాలో ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ యువకుడు అత్యంత ఖరీదైన లాంబోర్ఘీనీ కారును 160 కీమీల వేగంతో తోలుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

కరోనా టెస్టు చేయించుకోవాలని.. 160 కీమీల వేగంతో కారు తోలి..

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ యువకుడు అత్యంత ఖరీదైన లాంబోర్ఘీనీ కారును 160 కీమీల వేగంతో తోలుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘అంత వేగం ఎందుకు..ఇది చట్టవ్యతిరేకమని నీకు తెలియదా’ అని పోలీసులు అతడిని ప్రశ్నించారు. అయితే యువకుడు మాత్రం వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు తొందరగా వెళ్లాలని వేగంగా కారు తోలానని చెప్పుకొచ్చాడు. అసలే ఇది కరోనా కాలం కావడంతో పోలీసులు అతడిని వెంటనే కరోనా నిర్థారణ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. పరీక్ష తాలూకు వివరాలు త్వరలో వెలువడనున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ అతడు చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టి పోలీసులు అతడి లైసెన్సును రద్దు చేశారు.Updated Date - 2020-04-02T01:36:43+05:30 IST