ఎక్స్‌ప్రెస్ వే తవ్వకాల్లో 150 పురాతన నాణాలు, విగ్రహాలు లభ్యం!

ABN , First Publish Date - 2020-12-13T13:33:53+05:30 IST

యూపీలోని మవూ జిల్లాలోని ముహమ్మదాబాద్ గోహనా పరిధిలోని మహ్పుర్ గ్రామస్తులకు...

ఎక్స్‌ప్రెస్ వే తవ్వకాల్లో 150 పురాతన నాణాలు, విగ్రహాలు లభ్యం!

లక్నో: యూపీలోని మవూ జిల్లాలోని ముహమ్మదాబాద్ గోహనా పరిధిలోని మహ్పుర్ గ్రామస్తులకు అత్యంత విలువైన పురాతన నాణాలు లభ్యమయ్యాయి. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం కలిగించింది.  విషయం తెలుసుకున్న డీఎం అమిత్ సింగ్ బన్సాల్ గ్రామానికి చేరుకున్నారు. ఆయన 150కి మించిన విలువైన నాణాలను, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పురాతత్వ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నాణాలు, విగ్రహాలు కుషాణుల కాలానికి చెందినవి. వీటిని పరీక్షించేందుకు సంబంధిత ల్యాబ్‌కు పంపించారు. 


మహ్పూర్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేలో సిక్స్‌లేన్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన తవ్వకాల పనులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని పురాతన నాణాలు, విగ్రహాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకుని కొన్ని నాణాలను తీసుకుపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు అక్కడికి వచ్చి గ్రామస్తుల నుంచి 150 నాణాలను, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-12-13T13:33:53+05:30 IST