మంచు దుప్పటిలో కేదార్‌నాథ్.. ఉదయం నుంచి కురుస్తున్న మంచు!

ABN , First Publish Date - 2020-11-03T16:23:27+05:30 IST

దేశంలో వాతావరణం మార్పులు సంతరించుకుంటోంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లో ఈరోజు ఉదయం నుంచి ఎడతెగని రీతిలో మంచుకురుస్తోంది. కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ తెల్లని మంచు దుప్పటి పరుచుకుంది. ఇంతటి చలిలోనూ...

మంచు దుప్పటిలో కేదార్‌నాథ్.. ఉదయం నుంచి కురుస్తున్న మంచు!

కేదార్‌నాథ్: దేశంలో వాతావరణం మార్పులు సంతరించుకుంటోంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లో ఈరోజు ఉదయం నుంచి ఎడతెగని రీతిలో మంచుకురుస్తోంది. కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ తెల్లని మంచు దుప్పటి పరుచుకుంది. ఇంతటి చలిలోనూ కొందరు భక్తులు ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటున్నారు. 


ఆలయం చుట్టూ ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో సుమారు 2 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడున్న కుర్చీలన్నీ మంచుతో నిండిపోయాయి. ఇంతటి మంచు వాతావరణంలో ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలో వేచిచూశారు. చుట్టూ ఉన్న మంచును చూసి వారంతా మురిసిపోతున్నారు. 


Updated Date - 2020-11-03T16:23:27+05:30 IST