‘ఆటిజం’ బాలలకు పాఠాలు నేర్పే పక్షి రోబో

ABN , First Publish Date - 2020-03-02T07:49:53+05:30 IST

ఆటిజం బాధిత పిల్లలు అమాయకంగా.. తమదైన లోకంలో కాలం గడిపేస్తుంటారు!! అలాంటి చిన్నారులకు స్నేహితుడిలా ...

‘ఆటిజం’ బాలలకు పాఠాలు నేర్పే పక్షి రోబో

లాస్‌ ఏంజెలిస్‌, మార్చి 1 : ఆటిజం బాధిత పిల్లలు అమాయకంగా.. తమదైన లోకంలో కాలం గడిపేస్తుంటారు!! అలాంటి చిన్నారులకు స్నేహితుడిలా సలహాలిస్తూ, గురువులా పాఠాలు నేర్పే సరికొత్త పక్షి రోబోను అమెరికాలోని సౌతెర్న్‌ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దానికి ‘కివి’ అని పేరు పెట్టారు. ఇది చూడటానికి అచ్చం పక్షిలా రెక్కలు, ముక్కు, ఈకలు, తల కలిగి ఉంటుంది. అధ్యయనంలో భాగంగా 17 మంది ఆటిజం బాధిత పిల్లల ఇళ్లలో కివి రోబోలను ఉంచారు. వాటికి అనుసంధానమై ఉండే ట్యాబ్‌లలో పిల్లలు గణితం లెక్కలను చేసే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో వారు తడబడినప్పుడల్లా ‘కివి’ తన సూచనలిస్తూ లెక్కలకు జవాబు కనుగొనే దిశగా నడిపింది. సరైన సమాధానం కనుగొన్న వారిని ‘గుడ్‌ జాబ్‌’ అని ప్రశంసించింది. వెరసి, కివితో సమాచార మార్పిడి ద్వారా ఆటిజం బాధిత బాలల్లో సామాజిక నైపుణ్యాలు కూడా పెరిగాయి.

Updated Date - 2020-03-02T07:49:53+05:30 IST