-
-
Home » Prathyekam » retired officer killed maid who refused to come for work in rampur
-
పనిమనిషి రాలేదని... తుపాకీతో కాల్చి చంపిన రిటైర్డ్ అధికారి!
ABN , First Publish Date - 2020-12-06T16:55:46+05:30 IST
యూపీలోని రామ్‌పూర్‌లో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆరోజు రాలేదని...

రామ్‌పూర్: యూపీలోని రామ్‌పూర్‌లో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆరోజు రాలేదని ఆగ్రహించిన ఒక రిటైర్డ్ అధికారి ఆమె ఇంటికి వెళ్లి, ఆమెను తుపాకీతో షూట్ చేసి, హత్య చేయడమేకాకుండా, ఆమె కుమారుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి, విచారిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రామ్‌పూర్ పరిధిలోని ఛిద్దావాలా గ్రామంలో రిటైర్డ్ అధికారి సోమపాల్ సింగ్ ఇంటిలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటిపనులు చేస్తుంటుంది. అయితే ఆమె శనివారం పనిలోకి రాలేనని తెలిపింది.
దీంతో అగ్గిమీద గుగ్గిలమైన అధికారి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవ పడ్డాడు. మధ్యలో కలగజేకున్న ఆమె కుమారునిపై దాడి చేశాడు. తరువాత ఆమె జుట్టుపట్టకుని మెడమీద తుపాకీతో కాల్చాడు. దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసు అధికారి అరుణ్ కుమార్ సింగ్ ఈ ఉదంతంపై మాట్లాడుతూ, నిందితుడు సోమపాల్ తన ఇంటిలోపనిచేసే 35 ఏళ్ల మహిళను తుపాకీతో కాల్చి హత్య చేశారు. అడ్డుపడిన ఆమె కుమారుణ్ణి గాయపరిచాడన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.