రూపురేఖ‌ల్లోనే కాదు... మార్కుల్లోనూ క‌వ‌ల‌లే!

ABN , First Publish Date - 2020-07-15T12:05:54+05:30 IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 12 వ త‌ర‌గ‌తి ఫలితాల‌ను విడుదల చేసింది. గ్రేటర్ నోయిడాకు చెందిన కవల సోదరీమణులు త‌మ 12 వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

రూపురేఖ‌ల్లోనే కాదు... మార్కుల్లోనూ క‌వ‌ల‌లే!

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 12 వ త‌ర‌గ‌తి ఫలితాల‌ను విడుదల చేసింది. గ్రేటర్ నోయిడాకు చెందిన కవల సోదరీమణులు త‌మ 12 వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఐదు స‌బ్జ‌క్టుల‌లో ఒకే రీతిన 95.8 శాతం మార్కులు తెచ్చుకున్న మాన్సీ సింగ్, మాన్వీ సింగ్ ఇప్పుడు తోటి విద్యార్థుల మ‌ధ్య అట్రాక్ష‌న్‌గా మారిపోయారు. వీరు ఈ విధంగా ఒకే విధ‌మైన మార్కులను అంత‌కుమందు జ‌రిగిన త‌ర‌గ‌తుల‌లో కూడా తెచ్చుకోవ‌డం విశేషం. వీరిద్ద‌రూ ఆస్టర్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. 2003 మార్చి 3న వీరిద్ద‌రూ జ‌న్మించారు. ఈ సంద‌ర్భంగా మాన్సీ మాట్లాడుతూ తామిద్ద‌రం క‌ల‌సి కూర్చుని చ‌దువుకుంటామ‌ని, తాము ఐదు స‌బ్జ‌క్టుల‌లో ఒకే విధ‌మైన మార్కులు తెచ్చుకోవ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు. మాన్వీ త‌న‌క‌న్నా బాగా చ‌దివింద‌ని, అయితే ఇద్ద‌రి మార్కులు ఒకేలా వ‌చ్చాయ‌న్నారు. తామిద్ద‌రం ఇంజ‌నీరింగ్ చేయాల‌ని అనుకుంటున్నామ‌ని తెలిపారు. 

Updated Date - 2020-07-15T12:05:54+05:30 IST