తెల్ల ఎలుక కంటికి ఆపరేషన్... 25 గ్రాముల కణతి వెలికితీత!

ABN , First Publish Date - 2020-10-28T17:54:42+05:30 IST

యూపీలోని అలీగఢ్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ఒక తెల్ల ఎలుకకు ప్రాణం...

తెల్ల ఎలుక కంటికి ఆపరేషన్... 25 గ్రాముల కణతి వెలికితీత!

అలీగఢ్: యూపీలోని అలీగఢ్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ఒక తెల్ల ఎలుకకు ప్రాణం పోశారు. ఆ ఎలుక కంటిలో ఉన్న సుమారు 25 గ్రాముల కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. ఇప్పుడు ఆ ఎలుక పూర్తి ఆరోగ్యంతో ఉంది. నుమాయిష్ గ్రౌండ్ నివాసి అమిత్ కుమార్‌‌కు కొద్ది రోజుల క్రితం ఇంటికి సమీపంలో ఒక తెల్ల ఎలుక కనిపించింది. దానిని అమిత్ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఎలుకకు కంటిలో ఏదో సమస్య ఉన్నదని గ్రహించాడు. అందుకే అది ఏమీ తినలేకపోతున్న విషయాన్ని గుర్తించాడు. 


దీంతో అమిత్ తెల్ల చిట్టెలుకను సురేంద్ర నగర్‌లోని వెటర్నరీ డాక్టర్ విరామ్ వైష్నోయ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. దానిని పరిశీలించిన డాక్టర్ ఆ ఎలుక కంటిలో ట్యూమర్ ఉందని గమనించి, ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి, 25 గ్రాముల కణతిని తొలగించారు. ఒక గంట తరువాత ఆ ఎలుక కోలుకుంది. ఇప్పుడది పూర్తి ఆరోగ్యంతో అమిత్ ఇంట్లో తిరుగాడుతోంది. 


Updated Date - 2020-10-28T17:54:42+05:30 IST