ఆల్కహాల్ ఉందని.. గుడిలో శానిటైజర్ అనుమతించని పూజారి!

ABN , First Publish Date - 2020-06-07T01:39:29+05:30 IST

ప్రస్తుత కరోనా విపత్కాలంలో మనకు రక్షణ శానిటైజర్లు, మాస్కులే.

ఆల్కహాల్ ఉందని.. గుడిలో శానిటైజర్ అనుమతించని పూజారి!

భోపాల్: ప్రస్తుత కరోనా విపత్కాలంలో మనకు రక్షణ శానిటైజర్లు, మాస్కులే. ఇలాంటి సమయంలో శానిటైజర్లో ఆల్కహాల్ ఉందనే కారణంతో గుడిలోకి వాటిని అనుమతించలేదో పూజారి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. చంద్రశేఖర్ తివారీ అనే పూజారి ఇక్కడి మా వైష్ణవాధమ్ నవదుర్గా ఆలయంలో పనిచేస్తున్నాడు. ఈ ఆలయం వద్ద శానిటైజర్ మెషీన్ పెట్టడానికి కూడా అతను నిరాకరించాడు. ‘మద్యం సేవించి ఆలయంలోకి రావడం తప్పయినప్పుడు.. అదే ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ చేతులకు పూసుకొని గుడిలోకి ఎలా వస్తారు?’ అని చంద్రశేఖర్ ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-06-07T01:39:29+05:30 IST