లాక్డౌన్లో కేకు తెచ్చి, పుట్టినరోజు చేసిన పోలీసులు!
ABN , First Publish Date - 2020-05-17T14:58:34+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలోని గ్రీన్ ఆర్చ్ సొసైటీలో నివసిస్తున్న రష్మీ పాండే అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా పోలీసులు కేక్‌తో ఆమె ఇంటికి వచ్చారు. లాక్డౌన్లో జనం ఇంటి నుండి బయటకు రాకుండా నిషేధం ఉన్న విషయం...

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని గ్రీన్ ఆర్చ్ సొసైటీలో నివసిస్తున్న రష్మీ పాండే అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా పోలీసులు కేక్‌తో ఆమె ఇంటికి వచ్చారు. లాక్డౌన్లో జనం ఇంటి నుండి బయటకు రాకుండా నిషేధం ఉన్న విషయం విదితమే. ఈ నేపధ్యంలోనే పోలీసు అధికారి మునిర్ చౌహాన్ తోపాటు ఇతర పోలీసులు బహుమతులతో ఆ మహిళ ఇంటికి వచ్చారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాజిక దూరం పాటిస్తూ కేక్ కట్ చేసి, అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టారు. లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న వారిలో ఆనందం నింపేందుకు బిస్రక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ముందు వీరు ఆరేళ్ల చిన్నారికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.