-
-
Home » Prathyekam » PM Modi shares a moment with parrots
-
చిట్టి చిలుకలపై ప్రధాని మోదీ ప్రేమ...వీడియో వైరల్
ABN , First Publish Date - 2020-10-31T12:25:51+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిట్టి చిలుకలపై ప్రేమ కురిపించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

అహ్మదాబాద్ (గుజరాత్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిట్టి చిలుకలపై ప్రేమ కురిపించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్ రాష్ట్రంలో జంగిల్ సఫారీని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించిన అనంతరం పులులు, ఇతర జంతువులను పరిశీలించారు.ఆరోగ్యవన్, ఏక్తామాల్, చిన్నపిల్లల పౌష్టికాహార పార్క్, సర్దార్‌పటేల్ జూలాజికల్‌పార్కు/జంగిల్ సఫారీలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. జంగిల్ సఫారీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ భుజంపై ఒకటి, చేతిపై మరో చిలుకలు వాలాయి. మోదీ చిట్టి చిలుకలను చూసి మురిసిపోయారు. ప్రకృతి ప్రియులైన మోదీ జంగిల్ సఫారీలో ప్రకృతితో పాటు జంతువులు, రంగురంగుల వివిధ రకాల చిలుకలు, పక్షులను చూసి మైమరచిపోయారు.
తన చేతులపై వాలిన రెండు చిలుకలను ప్రధాని మోదీ ప్రేమగా చూస్తుండి పోయారు.గతంలోనూ ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ తన నివాసంలో జాతీయపక్షి నెమలికి గింజలు తినిపించే ఫొటోలు గతంలో వైరల్ అయ్యాయి. సఫారీలో రంగురంగుల పక్షిని చేతిలోకి తీసుకొని దానికి ప్రేమగా ధాన్యం తినిపించారు.మోదీ ప్రారంభించిన సఫారీ పార్కు పులుల గర్జనలు, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదకరంగా మారింది. 100 కు పైగా అడవి జంతువులు 1100 జాతుల విదేశీ పక్షులు ఈ పార్కులో ఉన్నాయి.