బంగారు వర్ణంలో అరుదైన తాబేలు.. వైరల్ అవుతున్న ఫొటో
ABN , First Publish Date - 2020-08-21T04:46:15+05:30 IST
నేపాల్‌లో ఓ అరుదైన తాబేలును జన్మించింది. వీపుపై బంగారు వర్ణపు చిప్పతో పాటు శరీరం కూడా పూర్తి బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. జన్యుకణాల్లో...

ఖాట్మండు: నేపాల్‌లో ఓ అరుదైన తాబేలును జన్మించింది. వీపుపై బంగారు వర్ణపు చిప్పతో పాటు శరీరం కూడా పూర్తి బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. జన్యుకణాల్లో ఏర్పడిన అత్యంత అరుదైన మార్పు వల్ల ఈ తాబేలు ఈ విధంగా జన్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత అరుదుగా ఇలాంటి తాబేళ్లు జన్మిస్తుంటాయని తెలిపారు. క్రొమాటిక్ లూసియమ్(జన్యువుల మార్పు వల్ల జీవి రంగు వేరుగా ఉండడం)తో జన్మించిన తొలి తాబేలు ఇదేనని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి సంబంధించి ఇలా అరుదైన రంగులో జన్మించిన ఐదో తాబేలు కూడా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.