చైనా గురించి ఆనాడే చెప్పా: కేఏ పాల్

ABN , First Publish Date - 2020-06-18T18:12:48+05:30 IST

చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

చైనా గురించి ఆనాడే చెప్పా: కేఏ పాల్

ఇంటర్నెట్ డెస్క్: భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని  కేఏ పాల్ అన్నారు. కరోనా వైరస్‌ను వ్యూహన్ ల్యాబ్ నుంచి చైనా వ్యూహాత్మకంగా పంపించిందని.. ఈ విషయం ముందు చెప్పిందే తానని అన్నారు. మార్చిలో ప్రపంచ దేశాలన్నింటికి లేఖలు రాసి, వీడియోలు పంపించానని, దానికి లక్షలమంది సంతకాలు చేసి మద్దతు తెలిపారని పాల్ అన్నారు. ఇవాళ భారత సైనికులు 20 మంది చనిపోయారంటే కారణేమేంటని ప్రశ్నించారు. చైనాకు ధీటైన నాయకుడు ప్రపంచంలో లేకపోవడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో అనధికార కాంట్రాక్టులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారని పాల్ ఆరోపించారు. అలాగే రష్యా మద్దతు కూడా ఆయన తీసుకుంటున్నారని అన్నారు. మన దేశాన్ని రక్షించాలని ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి దేశాభివృద్ధి కొరకు పాటుపడుదామని, ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు, భౌద్దువులు, జైనులు, సిక్కులు అందరిని కలిపిద్దామని తాను అనేక మీటింగ్‌లలో చెప్పానన్నారు. ఈ విషయమై అందరినీ కలపాలంటూ కపిల్ సిబల్‌తో మాట్లాడాన్నారు. దేశాన్ని కాపాడుకుందామని పిలుపు ఇచ్చారు. చైనా కరోనా వైరస్ ద్వారా ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించిందని పాల్ అన్నారు. చైనా గురించి పాల్ చెప్పిన మరిన్ని విషయాల కోసం వీడియో చూడగలరు.

Updated Date - 2020-06-18T18:12:48+05:30 IST