సైకిల్ తొక్కిన చిలుక.. వైరలవుతున్న వీడియో

ABN , First Publish Date - 2020-04-08T01:35:15+05:30 IST

మనం చెప్పిన మాటల్నే చెప్పి ఆశ్చర్యపరిచే రామచిలుకలు మనకు తెలుసు. మరి మనం తొక్కినట్లే సైకిల్ తొక్కే చిలుకల గురించి మీకు తెలుసా?

సైకిల్ తొక్కిన చిలుక.. వైరలవుతున్న వీడియో

ఇంటర్నెట్ డెస్క్: మనం చెప్పిన మాటల్నే చెప్పి ఆశ్చర్యపరిచే రామచిలుకలు మనకు తెలుసు. మరి మనం తొక్కినట్లే సైకిల్ తొక్కే చిలుకల గురించి మీకు తెలుసా? అయితే ఈ చిలుకను మీరు కూడా చూడాల్సిందే. అసలు సైకిల్ నేర్చుకోవడానికి మనం ఎన్ని తిప్పలు పడ్డామో గుర్తుందా? అలాంటిది ఈ చిలుక మాత్రం ఎంచక్కా సైకిల్ ఎక్కి రోడ్లన్నీ ఎలా తిరిగిస్తుందో చూడండి. ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియో చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే రోడ్డు మధ్యలో కొంచెం కూడా తడబాటు లేకుండా రిక్షాలాంటి తన సైకిల్ తొక్కేస్తుందీ చిలుక. గాల్లో గింగిరాలు కొడుతూ ఎంత దూరమైనా వెళ్లిపోయే ఈ పక్షి.. మనకోసం ఇంతలా కష్టపడుతుంటే ముచ్చటేయదూ? 

Read more