సముద్ర కెరటాల్లో నీలి వెలుగులు ... ఆశ్చర్యపోతున్న జనం

ABN , First Publish Date - 2020-04-25T18:14:23+05:30 IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలలో లాక్డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా చాలా దేశాలలో కాలుష్యం స్థాయి తగ్గింది. మరోవైపు ....

సముద్ర కెరటాల్లో నీలి వెలుగులు ... ఆశ్చర్యపోతున్న జనం

మెక్సికో సిటీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలలో లాక్డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా చాలా దేశాలలో కాలుష్యం స్థాయి తగ్గింది. మరోవైపు రద్దీ ప్రాంతాలు నిర్జనమైపోయాయి. ఇదే సమయంలో ఒక బీచ్‌లో ఆకర్షణీయమైన దృశ్యం దర్శనమిచ్చింది. సముద్రపు తరంగాల నుండి రంగురంగుల వెలుగులు పెల్లుబికాయి. ఈ దృశ్యం మెక్సికోలోని అకాపుల్కో బీచ్ లో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీటిలోని  సూక్ష్మజీవుల జీవరసాయన ప్రతిచర్య వల్ల ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంగతి తెలుసుకున్న చాలా మంది బీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ  సంఘటన గత 60 సంవత్సరాలలో మొదటిసారి జరిగిందని తెలుస్తోంది. ప్యూర్టో మార్క్యూస్ బీచ్‌లో జరిగిన ఈ సంఘటన సూక్ష్మజీవుల వల్ల కలిగే జీవరసాయన ప్రతిచర్యలోని ఉప ఉత్పత్తి అని మెక్సికోలోని అకాపుల్కో టూరిజం బోర్డు పేర్కొంది. ప్రోటీన్, ఆక్సిజన్, అడెనోసిన్ ట్రిఫాస్ఫేట్ ఇతర రసాయనాల ప్రతిచర్య వల్ల ఇటువంటి కాంతి వెలువడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. 

Updated Date - 2020-04-25T18:14:23+05:30 IST