పాక్ తప్పిదాలను లెక్కించిన న్యూజిలాండ్ క్రికెట్ అభిమాని

ABN , First Publish Date - 2020-12-28T16:40:56+05:30 IST

న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో...

పాక్ తప్పిదాలను లెక్కించిన న్యూజిలాండ్ క్రికెట్ అభిమాని

ఆక్లాండ్: న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ వింత దృశ్యం కనిపించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రికెట్ అభిమాని ఒకరు స్టేడియంలో కూర్చొని, మ్యాచ్‌లో పాకిస్తాన్ చేస్తున్న తప్పులను లెక్కిస్తూ వాటిని ఒక బోర్డుపై రాశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బోర్డుపై ఆ క్రీడాభిమాని ‘మిస్సయిన క్యాచ్‌లు’, ‘మిస్ ఫీల్డ్’, 'బ్యాడ్ త్రో’ ‘పూర్ యూజ్ వాఫ్ డీఆర్ఎస్’ క్యాటగిరీలు విభజించి, దానికింద సంబంధిత పాయింట్లు రాస్తూ వచ్చారు. ఈ ఫొటోను చూసిన మరో అభిమాని... స్మార్ట్ ప్రేక్షకులు ఉన్నకారణంగా... మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారుతున్నదని రాశారు.

Updated Date - 2020-12-28T16:40:56+05:30 IST