అతి చేసి బోర్లాపడ్డ పాక్! భారత్ లాగానే ట్రై చేసి.. చివరికి..

ABN , First Publish Date - 2020-05-12T01:57:50+05:30 IST

భారత్‌కు చర్యకు దీటుగా జవాబిద్దామనే తొందరలో పాకిస్థాన్ రేడియో దెబ్బైపోయింది. ఆ సంస్థ ఇటీవల చేసిన ట్వీట్‌లో దొర్లిన పొరపాటు కారణంగా నెటిజ్లన్లు వారితో ప్రస్తుతం ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు.

అతి చేసి బోర్లాపడ్డ పాక్! భారత్ లాగానే ట్రై చేసి.. చివరికి..

ఇస్లామాబాద్: భారత్ చర్యకు దీటుగా జవాబిద్దామనే తొందరలో పాకిస్థాన్ రేడియో దెబ్బైపోయింది. ఆ సంస్థ ఇటీవల చేసిన ట్వీట్‌లో దొర్లిన పొరపాటు కారణంగా నెటిజన్లు వారితో ప్రస్తుతం ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ దురాక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని కూడా తమ రోజువారి బులిటెన్లలో విడుదల చేస్తామంటూ భారత వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసందే. గిల్గిట్ బాల్టిస్తాన్ ఎన్నికల విషయంలో పాక్ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినందుకు ప్రతిగా భారత్ ఈ చర్యకు పూనుకుంది. కశ్మీర్ మొత్తం భారత్‌కు చెందినదేనంటూ ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టం చేసింది.


అయితే పాక్ రేడియో కూడా భారత్‌కు దీటుగా జవాబిచ్చే ఉద్దేశ్యంతో.. లద్దాఖ్‌లోని గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల సమాచారాన్ని ట్వీట్ చేసింది. గరిష్ట ఉష్ణ్రోగ్రత -4 డిగ్రీలని, కనిష్ట ఉష్ణోగ్రత -1 డిగ్రీలని  చెప్పుకొచ్చింది. అయితే గణిత శాస్త్రం ప్రకారం పెద్ద సంఖ్య అయిన -1ని కనిష్ట ఉష్ణోగ్రతగా  పేర్కనడాన్ని గుర్తించిన నెటిజన్లు పాక్‌ రేడియోతో కబడ్డీ ఆడేస్తున్నారు.  ‘ముందు అంకెలు నేర్చుకో ఆ తరువాత ట్వీట్లు చేద్దువుగాని’ అంటూ పంచ్‌లు పేల్చేశారు. 


Updated Date - 2020-05-12T01:57:50+05:30 IST