ఏడుగురి ప్రాణాలు కాపాడిన రెండేళ్ల బాలుడు.. గుజరాత్‌లో..

ABN , First Publish Date - 2020-12-17T23:47:47+05:30 IST

గుజరాత్‌లో రెండున్నరేళ్ల పసికందు ఏడుగురి ప్రాణాలను కాపాడాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూరత్ నగరంలో జాష్ ఓజా అనే రెండేళ్ల

ఏడుగురి ప్రాణాలు కాపాడిన రెండేళ్ల బాలుడు.. గుజరాత్‌లో..

సూరత్: గుజరాత్‌లో రెండున్నరేళ్ల బాలుడు ఏడుగురి ప్రాణాలను కాపాడాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూరత్ నగరంలో జాష్ ఓజా అనే రెండున్నరేళ్ల పిల్లోడు డిసెంబర్ 9న ఇంట్లోని బాల్కని నుంచి కింద పడిపోయాడు. తల్లిదండ్రులు ఓజాను వెంటనే ఆసుపత్రిలో చేర్చగా పసికందును కాపాడేందుకు వైద్యులు అనేక ప్రయత్నాలు చేశారు. మెదడు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఓజా బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిసెంబర్ 14న తల్లిదండ్రులకు చెప్పారు. పూర్తిగా కోలుకుని నవ్వుతూ ఇంటికి వస్తాడనుకున్న కొడుకు బ్రెయిన్ డెడ్ అవడాన్ని ఓజా తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఇటువంటి సమయంలోనూ తన కొడుకు అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడాలని ఓజా తండ్రి సంజీవ్ ఓజా నిర్ణయించుకున్నాడు. 


తమ కొడుకు అవయవాలను ఇతరులకు డొనేట్ చేసేందుకు తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడంతో ఓజా ఊపిరితిత్తులు, గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయాన్ని అవసరం ఉన్న పేషంట్లకు వైద్యులు వెంటనే పంపించారు. ఓజా గుండె, ఊపిరితిత్తులను మూడు గంటల వ్యవధిలోనే విమానం ద్వారా చెన్నైకి తరలించారు. రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి ఓజా గుండెను అమర్చారు. ఓజా రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ 13 ఏళ్ల బాలికకు ఉపయోగపడగా.. మరో కిడ్నీ సూరత్‌కు చెందిన 17 ఏళ్ల మరో బాలికకు అవసరమైంది. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగేళ్ల బిడ్డకు ఓజా ఊపిరితిత్తులను వేశారు. కొడుకు పోయిన బాధలోనూ అవయవ దానం చేయాలని ఓజా తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం నిజంగా గొప్ప విషయమని వైద్యులు కొనియాడారు.

Updated Date - 2020-12-17T23:47:47+05:30 IST