-
-
Home » Prathyekam » one of the passengers vandana who arrived in delhi from ahmedabad
-
గుజరాత్ టు ఢిల్లీ: ప‌్రత్యేక రైలు అనుభవాన్ని పంచుకున్న వందన
ABN , First Publish Date - 2020-05-13T16:01:30+05:30 IST
దాదాపు రెండు నెలలుగా వివిధ నగరాల్లోని బంధువులు,హోటళ్లలో చిక్కుకుపోయిన కొంతమందికి ప్రత్యేకరైళ్లు ఉపశమనం కలిగించాయి. అలా వేరే ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిలో ఢిల్లీనివాసి...

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా వివిధ నగరాల్లోని బంధువులు,హోటళ్లలో చిక్కుకుపోయిన కొంతమందికి ప్రత్యేకరైళ్లు ఉపశమనం కలిగించాయి. అలా వేరే ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిలో ఢిల్లీనివాసి వందన ఒకరు. ఆమె ఈరోజు ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను 55 రోజుల పాటు బంధువుల ఇంట్లో చిక్కుకుపోయానని, ఇన్నాళ్లకు ఢిల్లీకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలా రైళ్లను ఏర్పాటు చేసినందుకు రైల్వేశాఖకు ధన్యవాదాలు తెలిపారు. తనకు టిక్కెట్ దొరకడం అదృష్టమని అన్నారు. కాగా రైలులో ఢిల్లీకి చేరుకున్న ప్రయాణీకులందరికీ అధికారులు వైద్యపరమైన తనిఖీలు నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక స్క్రీనింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాక, కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు.