ఈ తాత విన్యాసాన్ని చూసి అవాక్కవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2020-10-31T22:44:57+05:30 IST

మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని ఓ తాత నిరూపించాడు. కుండను నెత్తిన మీద పెట్టుకుని సహాసం చేశాడు. గుంతలు వచ్చినా అదరలేదు, బెదరలేదు అనుకున్న..

ఈ తాత విన్యాసాన్ని చూసి అవాక్కవ్వాల్సిందే!

మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని ఓ తాత నిరూపించాడు. కుండను నెత్తిన మీద పెట్టుకుని విన్యాసం చేశాడు.  గుంతలు వచ్చినా  అదరలేదు, బెదరలేదు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చివరకు ఔరా ‘తాత’ అని అనిపించుకున్నారు. ఈ విన్యాసాన్ని ఆయన వెనుకున్న వారు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. 


విషయానికొస్తే.. ఓ తాత తన నెత్తిన మీద కుండను పెట్టుకుని బైపాస్ రోడ్డుపై బైక్ నడిపాడు. ఎదురు, వెనుక వాహనాలు వస్తున్నా అదరకుండా కిలో మీటర్ల మేర రయ్ రయ్ అంటూ దూసుకెళ్లాడు. వాహనాలు రద్దీగా ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఆసక్తికరమైన ఈ విన్యాసాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. 

Read more