-
-
Home » Prathyekam » mumbai dabbawala meels
-
అన్నం తెచ్చే వాళ్ల అసలు కథ..!
ABN , First Publish Date - 2020-06-23T00:01:58+05:30 IST
డబ్బావాలాలుగా పని చేసే వాళ్లకు ఎలాంటి ప్రత్యేక ప్రొఫిషనల్ ట్రైనింగ్ ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే సైకిల్ తొక్కడం వచ్చి...

ముంబై: డబ్బావాలాలుగా పని చేసే వాళ్లకు ఎలాంటి ప్రత్యేక ప్రొఫిషనల్ ట్రైనింగ్ ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే సైకిల్ తొక్కడం వచ్చి అడ్రస్‌లను గుర్తుపెట్టుకోగలిగే నైపుణ్యం ముంబై నగరంలో తాము పని చేసే ప్రాంతంపై కాస్త పట్టుంటే చాలు అంతకుమించి వారికి ఏ అర్హతలు అవసరం లేదు. రెండంచెల వ్యవస్థలో పని చేసే వాళ్లు వినియోగించే హై టెక్నాలజీ ఉందంటే అది ముంబై రైల్వే నెట్ వర్క్ మాత్రమే. సుమారు 5 వేల మంది ఉండే ఆ సహకార సంస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన వ్యవస్థల్లో ఒక్కొక్కటిగా గుర్తింపు పొందింది. వీళ్లు పూర్తిగా ఇంట్లో తయరు చేసిన భోజనాన్ని అది కూడా కస్టమర్ల స్వగృహాలకు అందించే వారు పని చేసే చోటుకు తీసుకెళ్లి అందిస్తారు. డబ్బావాలాలు నమ్మకంగా సేవలందించడమే కాదు. అందుకు వారు వసూలు చేసే మొత్తం కూడా కేవలం నెలకు రూ.800 మాత్రమే. ఆఫీసుకు భోజనం తెప్పించుకోవడమంటే జనం అదో విలాసం అనుకోవచ్చు. కానీ సెక్యూరిటీ గార్డుల నుంచి సీఈవో వరకూ అందరికీ వీరు సేవలందిస్తారు.