గడప దాటాలంటే వణుకే.. వైరలవుతున్న ఫన్నీ వీడియో!
ABN , First Publish Date - 2020-04-11T01:15:56+05:30 IST
లాక్డౌన్ గడవు ముగియబోతోంది. ప్రభుత్వం దీన్ని మరింత పొడిగిస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ గడవు ముగియబోతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ గడువు మరింత పొడిగించబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు మరో అడుగు ముందుకేసి తామే లాక్డౌన్ గడువు పెంచేశాయి. ప్రజలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో 144సెక్షన్లు కూడా అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ తరుణంలో గడప దాటాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇదే విషయాన్ని చెప్పిన హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’లోని ఓ సీన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అన్నట్లు ఇది ఎస్ఎస్ రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘మర్యాదరామన్న’కు రీమేక్.