జయలలిత నివాసంలో 4కిలోల బంగారం, 601 కిలోల వెండి లభ్యం

ABN , First Publish Date - 2020-07-30T11:43:12+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి దివంగత జయలలితకు పోయెస్ గార్డెన్‌లో ఉన్న మూడంతస్తుల భవనం ‘వేదనిలయం’లో 4.3 కిలోల బంగారం, 601 కిలోల వెండి....

జయలలిత నివాసంలో 4కిలోల బంగారం, 601 కిలోల వెండి లభ్యం

చెన్నై (తమిళనాడు) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి దివంగత జయలలితకు పోయెస్ గార్డెన్‌లో ఉన్న మూడంతస్తుల భవనం ‘వేదనిలయం’లో 4.3 కిలోల బంగారం, 601 కిలోల వెండి, 10,438 దుస్తులు, 8,300 పుస్తకాలున్నాయి. 2016 డిసెంబరులో జయలలిత అనారోగ్యంతో మరణించారు. జయలలిత నివాసమున్న వేదనిలయాన్ని స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు తమిళనాడు సర్కారు ప్రకటించింది.  జయలలిత నివాసంలో పూజ వస్తువులు, పలు వస్త్రాలు కలిపి మొత్తం 32,721 వస్తువులున్నాయని తేలింది. వేదనిలయాన్ని స్మారక చిహ్నంగగా మార్చడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం మే నెలలో దీన్ని స్వాధీనం చేసుకుంది.చరాస్తులను పురచ్చి తలైవి డాక్టర్ జె జయలలిత మెమోరియల్ ఫౌండేషన్ కు బదిలీ చేయాలని నిర్ణయించారు. చెన్నై నడిబొడ్డున ఉన్న పోయెస్ గార్డెన్ లో విశాల మైన మూడు అంతస్తుల బంగ్లా 21,000 చదరపు అడుగులుంది. జయలలిత నివాసంలో 162 వెండి వస్తువులు, 11 టీవీలు, పది రిఫ్రిజిరేటర్లు, 38 ఎయిర్ కండీషనర్లు, 556 ఫర్నిచర్ , 6,514 కిచెన్ పాత్రలు, 1055షో కేస్ కత్తులు, 15 పూజ పాత్రలు, 10,438 పాదరక్షలు, 29 మొబైల్ ఫోన్లు, 221 కిచెన్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు, 394 మెమోంటోలు, 653 ఐటీ, కోర్టు, లైసెన్సుల పత్రాలున్నాయి. పోయెస్ గార్డెన్ లో 65 సూట్ కేసులు, ఆరు గడియారాలు, 108 సౌందర్య సాధనాలున్నాయి. వేదనిలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జులై 25వతేదీన సివిల్ కోర్టులో రూ.67.9 కోట్లు జమ చేసింది. 

Updated Date - 2020-07-30T11:43:12+05:30 IST