గుండెల్ని పిండేసే తల్లి ప్రేమ @ ఎలుక

ABN , First Publish Date - 2020-07-20T23:26:10+05:30 IST

తల్లి ప్రేమకు ఏదీ సాటిలేదు. అది మనుషుల్లోనైనా జంతువుల్లో అయినా ఒక్కటే. పిల్లలు పుట్టినప్పటి నుంచి..

గుండెల్ని పిండేసే తల్లి ప్రేమ @ ఎలుక

తల్లి ప్రేమకు ఏదీ సాటిలేదు. అది మనుషుల్లోనైనా జంతువుల్లో అయినా ఒక్కటే. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసే వరకూ కంటికి రెప్పలా కాపాడుతుంది. అదే పిల్లలు ప్రాణాప్రాయంలో ఉంటే తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. అవసరమైతే తాను బలైనా సరే.. పిల్లల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే అది మనిషికి కాదు.. ఓ ఎలుకకు జరిగింది. వర్షంలో ప్రాణాలకు తెగించి తన పిల్లల్ని కాపాడుకుంది. ప్రాంతం ఎక్కడో తెలియదు గాని పిల్లల్ని కాపాడుకోవడానికి ఎలుక పడిన తపన, ఆరాటం, కష్టం చూస్తేంటే కన్నీరు రావడం ఖాయం. సీసీ కెమేరాలో రికార్డు అయిన తల్లి ఎలుక పోరాట దృశ్యాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


భూమిలో కొంత గుంత తొవ్వి (కలుగు) ఓ ఎలుక.. పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లలకు అనుకోని ప్రమాదం ఎదురైంది.


అసలేంజరిగిందంటే..:

ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఎలుక పిల్లలున్న గుంతలోకి కూడా వర్షపు నీరు చేరుతోంది. దీంతో ఒక్కసారిగా తల్లి ఎలుక ఆందోళనకు గురైంది. వర్షపు నీటితో గుంత నిండిపోతున్నా లెక్క చేయలేదు. ప్రాణాలకు తెగించి తన పిల్లలను కాపాడుకుంది. నీటి ప్రవాహం పెరుగుతున్నా ఒక్కొక్క పిల్లను నోటితో పట్టుకుని పరుగు తీసి సురక్షిత ప్రాంతానికి చేర్చింది. అలా తన పిల్లలను రక్షించుకుంది తల్లి ఎలుక. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చలించి పోయారు. ‘అమ్మ ఎక్కడైనా అమ్మే’.. ‘అమ్మ ప్రేమకు వెలకట్టలేం’ అంటూ తల్లి ఎలుకపై ప్రశంసలు కురిపించారు. 

Updated Date - 2020-07-20T23:26:10+05:30 IST