నాట్లు వేస్తున్న ఈ చిన్నారి ఎవరి కుమార్తెనో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-12-30T14:13:30+05:30 IST

ఈ చిన్నారి పేరు ఆరాధ్య నాయక్. కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేష్ కుమార్తె. నాల్గవ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా...

నాట్లు వేస్తున్న ఈ చిన్నారి ఎవరి కుమార్తెనో తెలిస్తే..

కంప్లి: ఈ చిన్నారి పేరు ఆరాధ్య నాయక్. కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేష్ కుమార్తె. నాల్గవ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న ఈ చిన్నారికి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. కూలీలతో వెళ్లి పొలం పనులు పరిశీలించేది. మంగళవారం కూలీలతో నాట్లు వేయడాన్ని నేర్చుకున్న ఆరాధ్య.. చకచకా నాట్లు వేస్తూ అందరినీ మెప్పించింది. వ్యవసాయంపై ఆ చిన్నారి ఆసక్తి చూపడంపై తల్లిదండ్రులూ ఆసక్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-30T14:13:30+05:30 IST