ఊరెళ్లేందుకు బైక్‌నే కారుగా మల‌చి... ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

ABN , First Publish Date - 2020-05-18T11:02:22+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుండి వ‌ల‌స‌ కార్మికులు స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వెళ్లేందుకు చాలా కష్టపడుతున్నారు.

ఊరెళ్లేందుకు బైక్‌నే కారుగా మల‌చి... ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుండి వ‌ల‌స‌ కార్మికులు స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వెళ్లేందుకు చాలా కష్టపడుతున్నారు. కొంత‌మంది కాలినడకన వేలాది కిలోమీటర్ల దూరం వెళుతుండ‌గా, ఒక వ‌ల‌స‌కూలీ విచిత్ర వాహ‌నం రూపొందించి, త‌న కుటుంబాన్ని గ్రామానికి త‌ర‌లిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి టూ వీల‌ర్‌ను అత్యంత విచిత్ర రీతిలో ఫోర్ వీల‌ర్‌గా మార్చిన విష‌యాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. పైగా ఈ వ్య‌క్తి స్టీరింగ్ వీల్‌ను ఈ వినూత్న కారుకు అమ‌ర్చి, వాహ‌నాన్ని నియంత్రిస్తూ ముందుకుపోనిస్తున్నాడు. ఈ వీడియోను మారికో కంపెనీ ఛైర్మన్ హర్ష్ మారివాలా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ... ఇది ప్రయాణించడానికి సురక్షితమైన మాధ్యమం కాదని పేర్కొన్నారు. కాగా దేశీయ‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడానికి ఇలాంటి వారికి అవ‌కాశాలివ్వాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు. అయితే వీడియోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌దీ ఇంకా తెలియ‌రాలేదు. 

Updated Date - 2020-05-18T11:02:22+05:30 IST