ఆమె అడవికి రాజు... 300 సింహాలు, 500 చిరుతలను కాపాడి...
ABN , First Publish Date - 2020-08-11T12:47:18+05:30 IST
అటవీశాఖలో పనిచేస్తున్నఆ మహిళా అధికారి ఇప్పుడు అందరి ప్రసంశలను అందుకుంటున్నారు. దీనికి కారణం ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఒక ఫొటోను పంచుకోవడమే. ఈ ఫొటో కింద ఆయన...

న్యూఢిల్లీ: అటవీశాఖలో పనిచేస్తున్నఆ మహిళా అధికారి ఇప్పుడు అందరి ప్రసంశలను అందుకుంటున్నారు. దీనికి కారణం ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఒక ఫొటోను పంచుకోవడమే. ఈ ఫొటో కింద ఆయన ఇలా రాశారు... రసిలా వాధోర్... గిర్‌లో ఫారెస్టర్. ఇప్పటివరకు ఆమె 1000కి పైగా జంతువులను రక్షించారు. 300 సింహాలు, 500 చిరుతపులులు, మొసళ్ళు, కొండచిలువలను రక్షించారు. ఆమె అడవికి రాజు... అంతకంటే ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. రసిలా గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ లో పనిచేస్తున్నారు. అటవీశాఖలో జంతువులను సంరక్షించే బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా పేరొందారు. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నసమయంలో అక్కడి అటవీశాఖలో మహిళల నియామకం జరిగింది. 2008లో రసిలా అటవీశాఖలో చేరారు. ఆమె గాయపడిన అటవీ జంతువుల వద్దకు వెళ్లి, వాటికి సపర్యలు చేసి, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు వృత్తి విషయంలో పని గంటలు ఉండవని, జంతువులను ఏ సమయంలోనైనా రక్షించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వృత్తిలో ఎన్ని సమస్యలు ఎదువుతున్నా, ఆమె బాధ్యతాయుతంగా పనిచేస్తుంటారని తోటి ఉద్యోగులు ఆమెను అభినందిస్తుంటారు.