మాటలు మార్చే మాస్క్.. 8 భాషల్లోకి అనువాదం!

ABN , First Publish Date - 2020-06-27T03:27:13+05:30 IST

ప్రస్తుతం కరోనా భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. మాస్కులు, శానిటైజర్లు లేనిదే ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు.

మాటలు మార్చే మాస్క్.. 8 భాషల్లోకి అనువాదం!

టోక్యో: ప్రస్తుతం కరోనా భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. మాస్కులు, శానిటైజర్లు లేనిదే ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. ఈ పరిస్థితుల్లో ఫేస్‌మాస్కులను కూడా మరింత ఉపయోగకరంగా మార్చాలని జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ డిసైడయింది. అంతే మాటలు ట్రాన్స్‌లేట్ చేసే ఓ మాస్కును తయారుచేసింది. ఈ మాస్కు మన మాటలను 8 భాషల్లోకి అనువదిస్తుంది. ఈ స్మార్ట్ మాస్క్‌ను ‘సీ మాస్క్’ అని పిలుస్తున్నారు. మొబైల్‌లో ఓ ట్రాన్స్‌లేషన్ యాప్‌తో కనెక్టయ్యే ఈ మాస్క్.. దాని సాయంతో మన స్వరంలో కూడా భాషకు తగినట్లుగా కొన్ని మార్పులు చేస్తుందట. ఈ కంపెనీ తొలివిడతగా 5వేల సీ-మాస్కులు సిద్ధం చేసింది. జపనీస్ నుంచి ఎనిమిది భాషల్లోకి మాటలను అనువదించే ఈ మాస్కులను సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Updated Date - 2020-06-27T03:27:13+05:30 IST