వెన్ను నొప్పితో ఆసుపత్రికి వెళితే.. షాక్‌కు గురైన డాక్టర్లు

ABN , First Publish Date - 2020-05-09T00:24:54+05:30 IST

తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి సీటీ స్కాన్ చేసి వెన్నెముక చివరి భాగంలో డిస్క్ జారినట్లు గుర్తించారు. అయితే ఈ క్రమంలో...

వెన్ను నొప్పితో ఆసుపత్రికి వెళితే.. షాక్‌కు గురైన డాక్టర్లు

బ్రజీలియా: తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి సీటీ స్కాన్ చేసి వెన్నెముక చివరి భాగంలో డిస్క్ జారినట్లు గుర్తించారు. అయితే ఈ క్రమంలో డాక్టర్లకు ఊహించని షాక్ తగిలింది. అందరిలా కాకుండా ఇతడికి మూడు కిడ్నీలు ఉండడమే అందుకు కారణం. ఎడమవైపు కిడ్నీ బాగానే ఉన్నప్పటికీ, కుడివైపు కిడ్నీ మాత్రం విచిత్రంగా రెండుగా చీలిపోయి ఉంది. దీనిని గమనించిన డాక్టర్లు తొలుత ఆశ్చర్యపోయారు.  అనంతరం పరిస్థితి అర్థం చేసుకుని దీనికి గల కారణాలను వివరించారు. సాధారణంగా తల్లి గర్భంలో బిడ్డకు కిడ్నీలు ఏర్పడే సమయంలో కొన్ని కారణాల వల్ల ఒకటే కిడ్నీ రెండుగా విడిపోతుందని, దానివల్ల ఆ బిడ్డకు సాధారణ మనుషులకంటే ఒకటి లేదా రెండు కిడ్నీలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు వందకు మించి లేవని తెలిపారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, అదనపు అవయవాలు ఉన్నప్పటికీ ఆరోగ్యకరంగానే జీవితం కొనసాగుతుందని వివరించారు. బాధితుడికి వెన్నెముక నొప్పికి సంబంధించినంత వరకు మందులు అందజేసి డిశ్చార్జ్ చేశారు.

Updated Date - 2020-05-09T00:24:54+05:30 IST