పది బీర్లు తాగి రోజంతా నిద్ర! సాయంత్రానికల్లా ఊహించని దారుణం!

ABN , First Publish Date - 2020-06-22T02:49:20+05:30 IST

వచ్చినప్పుడు వెళ్లాలి.. లేకపోతే అనర్థాలు జరిగిపోతాయ్.. అన్న విషయాన్ని ఓ చైనా ప్రబుద్ధుడు అత్యంత బాధకరమైన రీతిలో తెలుసుకున్నాడు.

పది బీర్లు తాగి రోజంతా నిద్ర! సాయంత్రానికల్లా ఊహించని దారుణం!

బీజింగ్: వచ్చినప్పుడు వెళ్లాలి.. లేకపోతే అనర్థాలు జరిగిపోతాయ్.. అన్న కఠోర సత్యాన్ని ఓ చైనా ప్రబుద్ధుడు అత్యంత బాధకరమైన రీతిలో తెలుసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. జేజియాంగ్ ప్రావిన్సుకు చెందిన హు అనే వ్యక్తి ఇటీవల ఏకబిగిన 10కి పైగా బీర్లు తాగేసాడు. దీంతో అతడు మూసిన కన్ను తెరవకుండా రోజంతా(18 గంటలు) నిద్రపోయాడు. అయితే సాయంత్రం చీకటిపడుతున్న సమయంలో ఒక్కసారిగా అతడికి మెళకువ వచ్చింది. పొత్తికడుపులో భయంకరమైన నొప్పితో అతడు మెలికలు తిరిగిపోయాడు. అతడి స్నేహితులు వెంటనే హును స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షలు చేసిన మీదట డాక్టర్లకు అసలు విషయం బోధపడింది. దాదాపు 18 గంటల పాటు మూత్రవిసర్జన చేయకుండా అలాగే నిద్రపోవడంతో మూత్రాశయం గోడలకు చీలికలు ఏర్పడ్డాయని వారికి అర్థమైంది. అదృష్టవశాత్తూ మూత్రాశయానికి వారు చేసిన రిపేర్ ఫలితాన్నివ్వడంతో మనోడు పెద్ద గండం నుంచే గట్టెక్కాడు. సో.. అదన్నమాట విషయం.. అందుకే పెద్దలు అంటారు అతి సర్వత్రా వర్జయేత్ అని.

Updated Date - 2020-06-22T02:49:20+05:30 IST