బతికున్న తల్లిని పూడ్చిపెట్టిన తనయుడు.. మూడు రోజుల తర్వాత చూస్తే షాక్

ABN , First Publish Date - 2020-05-08T22:57:32+05:30 IST

తల్లి వృద్ధురాలైందన్న కారణంతో.. కొడుకు ఆమెను తీసుకెళ్లి స్థానికంగా ఉన్న శ్మశానంలో పూడ్చి పెట్టేశాడు. తరువాత ఎంచక్కా...

బతికున్న తల్లిని పూడ్చిపెట్టిన తనయుడు.. మూడు రోజుల తర్వాత చూస్తే షాక్

బీజింగ్: తల్లి వృద్ధురాలైందన్న కారణంతో.. కొడుకు ఆమెను తీసుకెళ్లి స్థానికంగా ఉన్న శ్మశానంలో పూడ్చి పెట్టేశాడు. తరువాత ఎంచక్కా ఇంటికి తిరిగి వచ్చేశాడు. వెళ్లేటప్పుడు తల్లిని వెంట తీసుకెళ్లిన భర్త ఒంటరిగా తిరిగి రావడంతో అతడి భార్య నిలదీసింది. అయితే అతడు ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. మూడు రోజులైనా అత్తమ్మ జాడ తెలియకపోవడంతో అతడి భార్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిజం చెప్పిన అతడు తన తల్లి సంరక్షణను తానిక చూసుకోలేనని, అందుకే తీసుకెళ్ళి బతికుండగానే శ్మశానంలో పూడ్చిపెట్టేశానని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు శ్మశానానికి చేరుకుని పూడ్చి పెట్టిన ప్రాంతంలో తవ్వడం ప్రారంభించారు. అయితే కొద్ది సేపటికి లోపలి నుంచి చిన్నగా ఎవరిదో కంఠం వినపడడం ప్రారంభించింది.


ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన పోలీసులు గబగబా సమాధిని తవ్వి లోపలి మనిషిని బయటకు తీశారు. అయితే ఆమె బతికే ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మృతురాలి పేరు వాంగ్ అని, ఆమె వయసు 79 సంవత్సరాలని తెలుస్తోంది. 58 ఏళ్ల ఆమె కుమారుడు మాహ్ ఆమెను అర్థరాత్రిపూట తీసుకొచ్చి శ్మశానంలో పూడ్చి వెళ్లిపోయాడని, అయితే మట్టిని పైపైన కప్పడంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం వీలైందని, కానీ, మూడు రోజులుగా సమాధిలో ఉండడంతో పాక్షికంగా పక్షవాతానికి గురైందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

Updated Date - 2020-05-08T22:57:32+05:30 IST