అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి..డైనోసార్ పుర్రెలో తలదూర్చి..

ABN , First Publish Date - 2020-05-17T17:04:27+05:30 IST

అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి..డైనోసార్ పుర్రెలో తలదూర్చి సెల్ఫీలు దిగి పరారైపోయిన వ్యక్తి కోసం ఆస్ట్రేలియా పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.

అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి..డైనోసార్ పుర్రెలో తలదూర్చి..

క్యాన్‌బెర్రా: అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి..డైనోసార్ పుర్రెలో తలదూర్చి సెల్ఫీలు దిగి పరారైపోయిన వ్యక్తి కోసం ఆస్ట్రేలియా పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. న్యూసౌత్ వేల్స్‌లో శనివారం ఆర్థరాత్రి.. సిడ్నీలోని మ్యూజియంలోకి చొరబడ్డాడని సీసీటీవీల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. దాదాపు 40 నిమిషాల పాటు నిందితుడు ఆ ప్రాంగణమంతా కలియతిరిగాడని, డైనోసార్ పుర్రెలో తలపెట్టి సెల్ఫీ కూడా దిగాడని పోలీసులు తలపెట్టారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోతూ తన వెంట ఓ టోపీని, ఓ చిత్రపటాన్ని తీసుకెళ్లాడని తెలుస్తోంది. భవనం నవీకరణలో భాగంగా గత ఏడాది చివరి నుంచి మ్యూజియంను అక్కడి అధికారులు మూసేశారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో దేశంలోని ఇతర మ్యూజియంలను కూడా ప్రభుత్వం మూసివేసింది. అయితే ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని విచారణ జరుపుతున్న పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తూ విలువైన వస్తువులేవీ పోలేదన్న ఆయన..నిందితుడి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.  

Updated Date - 2020-05-17T17:04:27+05:30 IST