వైరల్: కరోనా మరింత పేట్రేగిపోతే చూడాలని ఇలా దారుణంగా..

ABN , First Publish Date - 2020-03-24T23:26:47+05:30 IST

కరోనా మహమ్మారి మరింత పేట్రేగితే చూసి పైశాచికానందం పొందాలనుకున్న ఓ వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు.

వైరల్: కరోనా మరింత పేట్రేగిపోతే చూడాలని ఇలా దారుణంగా..

మ్యూనిక్: కరోనా మహమ్మారి మరింత పేట్రేగితే చూసి పైశాచికానందం పొందాలనుకున్న ఓ వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఆ దేశం కట్టుదిట్టమైన కరోనా ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. టికెట్ వెండింగ్ మెషీన్లు, ఎస్కలేటర్, మెట్ల హ్యాండ్ రెయిల్స్‌ను నాలికతో తాకుతూ కొన్ని వీడియోలు తీసుకున్నాడు. వీటిని సోషల్ మీడియా పోస్ట్ చేయడమే కాకుండా.. కరోనా మరింతగా వ్యాప్తి చెందాలని ఇదంతా చేస్తున్నానంటూ ఘనంగా చెప్పుకొచ్చాడు. ఇది పోలీసులకు వరకూ వెల్లడంతో వారు అతడిని అరెస్టు చేశారు. కాగా.. నిందితుడికి అసలు కరోనా బారినపడ్డాడో లేదో తెలుసుకునేందుకు అతడికి నిర్ధారణ పరీక్షలు జరిపారు. అతడిపై రకరకాల సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. 

Read more