యుద్ధ విమానంలో వృద్ధుడి షికారు! కంగారులో ఆ బటన్ నొక్కడంతో అకస్మాత్తుగా..

ABN , First Publish Date - 2020-04-16T04:02:32+05:30 IST

ఫైటర్ జెట్‌లో షికారు చేస్తున్న ఓ వ్యక్తికి ఒత్తడి ఎక్కువడంతో అతడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

యుద్ధ విమానంలో వృద్ధుడి షికారు! కంగారులో ఆ బటన్ నొక్కడంతో అకస్మాత్తుగా..

పారిస్: ఫైటర్ జెట్‌లో షికారు చేస్తున్న ఓ వ్యక్తికి (64) ఒత్తడి ఎక్కువడంతో అతడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తూ  ఈ ఘటనలో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. గత ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇటీవలే వెల్లడయ్యాయి. ఓ ఆయుధ తయారీ కర్మాగారంలో పని చేసే వ్యక్తిని సహాద్యోగులు సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాడు. ఓ రోజు అతడు ఆఫీసుకు రాగానే.. నిన్ను దసో యుద్ధ విమానంలో షికారుకు తీసుకెళుతున్నామని చెప్పారు. అయితే ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన అనుభవం అతడికి లేదు. కానీ సహోద్యోగుల ఒత్తిడి తలొగ్గి అతడు విమానమెక్కాడు. కానీ విమానం టేకాఫ్ చేస్తున్న సమయంలో అతడు విపరీతమైన ఒత్తిడికి గురయ్యాడు. గాభరా ఎక్కువై గుండె వేగం తారాస్థాయికి చేరుకుంది. ఈ కంగారులో అతడు తన సీటును గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే  ప్రమాదవశాత్తూ అతడు ఎజెక్షన్ మీటను ఒత్తాడు. దీంతో విమానం గాల్లో ఉండగానే  సీటుతో సహా అతడు విమానం నుంచి అకస్మాత్తుగా బయటకొచ్చేశాడు. ఫైటర్ జెట్ కేవలం 2500 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ పారాషూట్ సహాయంతో అతడు సురక్షితంగా నేల మీదకు దిగాడు. కొద్ది పాటి గాయాలతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు.. పైలట్ కూడా విమానాన్ని సురక్షితంగా దించడంతో భారీ ప్రమాదం తప్పిపోయింది. 

Updated Date - 2020-04-16T04:02:32+05:30 IST