అధికారిక సమావేశంలో ఓ వ్యాపారవేత్త నగ్నంగా.. షాకైపోయిన దేశాధ్యక్షుడు!

ABN , First Publish Date - 2020-05-18T21:44:20+05:30 IST

దేశాధ్యక్షుడితో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా జరిగిన చిన్నపొరపాటు కారణంగా ఓ పారిశ్రామిక వేత్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చింది.

అధికారిక సమావేశంలో ఓ వ్యాపారవేత్త నగ్నంగా.. షాకైపోయిన దేశాధ్యక్షుడు!

బ్రెజీలియా:  వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా జరిగిన చిన్నపొరపాటు కారణంగా  బ్రెజిల్ అధ్యక్షుడికి ఊహించని అనుభవం ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ ప్రభావం గురించి చర్చించేందుకు అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో వివిధ వర్గాల ప్రతినిథులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 10 మంది పాల్గొన్న ఈ సమావేశంలో సోవోపావ్‌లో రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు పావ్‌లో స్కాఫ్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో తన స్క్రీన్‌పైన కనిపిస్తున్న దృశ్యాలు చూసి అధ్యక్షుడు ఒక్కసారిగా షాకయ్యారు. ‘పావ్‌లో.. స్క్రీన్ చివర ఒసారి చూడు. అతనికేమైంది..? అతడి పరిస్థితి బాగనే ఉందా..?’ అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు.దీంతో స్క్రీన్‌ను వైపు చూసిన పావ్‌లో కూడా షాకైపోయారు.


ఆ సమేవేశంలో పాల్గొన్న ఓ ప్రారిశ్రామిక వేత్త నగ్నంగా స్నానం చేస్తూ కనిపించడంతో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే జరుగుతున్న తతంగమంతా సమేవేశంలోని మరో మంత్రికి అర్థమైపోయింది. ‘..నగ్నంగా స్నానం చేస్తున్నాడు. బహుశా  మన చర్చ.. అతడిలో వేడి పుట్టించిందనుకుంట. స్నానం చేస్తూ కూలవుతున్నాడు’ అంటూ సరదా కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు.. ‘అవును.. దురదృష్టవశాత్తూ ఇది మన కంట పడింది’ అంటూ ముక్తాయించారట. ఇందుకు సంబంధించిన దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సదరు వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. 

Updated Date - 2020-05-18T21:44:20+05:30 IST