లామాల నానో బాడీలతో కరోనాకు చెక్‌

ABN , First Publish Date - 2020-07-14T07:05:45+05:30 IST

కరోనా వైర్‌సలోని స్పైక్‌ ప్రొటీన్‌ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది. దీనిని అడ్డుకోగలిగితే.. కరోనా వ్యాప్తికి ఆదిలోనే అంతం పలకొచ్చు...

లామాల నానో బాడీలతో కరోనాకు చెక్‌

లండన్‌, జూలై 13 : కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది. దీనిని  అడ్డుకోగలిగితే.. కరోనా వ్యాప్తికి ఆదిలోనే అంతం పలకొచ్చు. ఈ దిశగా ప్రయోగాలు జరిపిన బ్రిటన్‌లోని రోసాలిండ్‌ ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఆశాజనక ఫలితాలను సాధించారు. ఒంటెలా ఉండే లామాల రక్తంలోని నానోబాడీలను.. స్పైక్‌ ప్రొటీన్లతో పరస్పరం చర్య జరిపించారు. హెచ్‌11-హెచ్‌4, హెచ్‌11-డీ4 అనే రెండు  నానోబాడీలు స్పైక్‌ ప్రొటీన్‌ మొన భాగాన్ని దుప్పటిలా కప్పేశాయి. ఫలితంగా ఏసీఈ2లోకి స్పైక్‌ ప్రొటీన్‌ చొచ్చుకు వెళ్లలేకపోయింది.  


Updated Date - 2020-07-14T07:05:45+05:30 IST