డ్రమ్ములో నుంచి గోధుమలు తీస్తున్న మహిళ... ఇంతలో బుస్.. బుస్ మంటూ...

ABN , First Publish Date - 2020-09-12T17:27:40+05:30 IST

యూపీలోని లఖీంపుర్ జిల్లాలో ఫూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్వల్ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారంతా ఆ క్షణంలో బిక్కచచ్చిపోయారు. ఆ ఇంటిలోని ఒక మహిళ భారీ డ్ర్రమ్ములో నుంచి గోధుమలు..

డ్రమ్ములో నుంచి గోధుమలు తీస్తున్న మహిళ... ఇంతలో బుస్.. బుస్ మంటూ...

లఖీంపుర్ ఖీరీ: యూపీలోని లఖీంపుర్ జిల్లాలో ఫూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్వల్ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారంతా ఆ క్షణంలో బిక్కచచ్చిపోయారు. ఆ ఇంటిలోని ఒక మహిళ భారీ డ్ర్రమ్ములో నుంచి గోధుమలు తీస్తుండగా, ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, జరజర పాకుతూ బయటకు వచ్చింది. దానిని చూడగానే ఆ ఇంట్లోని వారికి ప్రాణాలు పోయినంత పనయ్యింది.


గ్రామానికి చెందిన అమరేంద్ర సింగ్ భార్య గోధుమలు తీస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంత పెద్ద పామును చూడగానే ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ఆ డ్రమ్ములో నుంచి బయటకు వచ్చిన పాము కోసం ఎక్కడికి వెళ్లిందా? అని అక్కడున్నవారు గాలించారు. ఆ డ్రమ్మును కాస్త పక్కకు జరపగా అద అక్కడ నక్కివుంది. అక్కడున్న ఒక యువకుడు ఆ పాము తోక పట్టుకుని, జాగ్రత్తగా దానిని ఒక డబ్బాలో బంధించి, అడవిలో విడిచి పెట్టాడు. 


Updated Date - 2020-09-12T17:27:40+05:30 IST