పుట్టినరోజు,వివాహ వార్షికోత్సవం ద్వారా 17 మందికి కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-06-22T16:23:39+05:30 IST

ఓ మహిళ ద్వారా 17 మందికి కరోనా సోకింది....

పుట్టినరోజు,వివాహ వార్షికోత్సవం ద్వారా 17 మందికి కరోనా వైరస్

భువనేశ్వర్ (ఒడిశా): ఓ మహిళ ద్వారా 17 మందికి కరోనా సోకింది. కరోనా వైరస్ సోకిన ఓ  మహిళ  తన కుమారుడి జన్మదిన వేడుకలు జరపడంతోపాటు, తన పొరుగింటి వ్యక్తి వివాహ వార్షికోత్సవానికి హాజరు కావడంతో ఆమె ద్వారా 17 మందికి కొవిడ్-19 పాజిటివ్ అని వచ్చిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లాలో వెలుగుచూసింది.ఝార్సుగూడలోని ఓఎంపీలోని బ్రాజ్ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన కరోనా సోకిన ఓ మహిళ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి తన కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించింది. దీంతోపాటు తన పొరుగింటి వ్యక్తి వివాహవార్షికోత్సవంలో ఆమె పాల్గొంది. దీంతో మూడు కుటుంబాలకు చెందిన 17 మందికి కరోనా సోకింది. గురుగ్రామ్ నగరం నుంచి ఓ మహిళ ఈ నెల 14వతేదీన తన భర్త, కుమారుడితో కలిసి ఝార్సీగూడకు తిరిగి వచ్చింది. సదరు మహిళతో పాటు భర్త, కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెతో పాటు కుటుంబాన్ని 14 రోజుల పాటు హోంక్వారంటైన్ చేశారు.క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన మహిళ తన కుమారుడి జన్మదినోత్సవం నిర్వహించింది. దీంతోపాటు తన పొరుగింటి వ్యక్తి వివాహ వార్షికోత్సవానికి మహిళ హాజరైంది. దీంతో మూడు కుటుంబాల్లోని 17 మందికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందని ఝార్సుగూడ జిల్లా కలెక్టరు సరోజ్ కుమార్ సమాల్ చెప్పారు. కంటైన్మెంట్ జోన్ లో కుమారుడి జన్మదినోత్సవం నిర్వహించిన మహిళ కరోనా వ్యాప్తికి కారణమయ్యారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేర క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైన మహిళతోపాటు రెండు కుటుంబాలపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ సెక్షన్ 15, ఐపీసీ 296, 271, 188 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామని కలెక్టర్ చెప్పారు. ఝార్సుగూడ జిల్లాలో ఒకేరోజు 304 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.  

Updated Date - 2020-06-22T16:23:39+05:30 IST