టీవీ చూస్తే గంటకు రూ.3,281...

ABN , First Publish Date - 2020-06-26T21:02:34+05:30 IST

మీరు చదివింది నిజమే. టీవీ చూస్తే అంత జీతమేమిటి ? అసలు టీవీ చూస్తేనే జీతమిస్తారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదళ్ళను తొలుస్తాయి. కానీ ఇది నిజమండి బాబూ..! అలా వారంలో ఇరవై గంటలు చూడాలి. ఇక వివరాలిలా ఉన్నాయి. కరోనా వల్ల ఎన్నో సంస్థలు నష్టాల్లో కూరుకపోయిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి కరవు కాలంలో ఓ సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

టీవీ చూస్తే గంటకు రూ.3,281...

లండన్ : మీరు చదివింది నిజమే. టీవీ చూస్తే అంత జీతమేమిటి ? అసలు టీవీ చూస్తేనే జీతమిస్తారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదళ్ళను తొలుస్తాయి. కానీ ఇది నిజమండి బాబూ..! అలా వారంలో ఇరవై గంటలు చూడాలి. ఇక వివరాలిలా ఉన్నాయి. కరోనా వల్ల ఎన్నో సంస్థలు నష్టాల్లో కూరుకపోయిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి కరవు కాలంలో ఓ సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. 


జస్ట్ టీవీ చూస్తే చాలు.... గంటకు 35 పౌండ్లు (రూ. 3,281) చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. బ్రిటన్‌కు చెందిన ‘ఆన్ బయ్’సంస్థ ఈ ఉద్యోగ ప్రకటననిచ్చింది. పద్ధెనిమిదేళ్ళ వయస్సు దాటిన ఏ అభ్యర్థి అయినా సరే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు స్పోకెన్ ఇంగ్లీష్, కంటెంట్ రాయడంతో నైపుణ్యముండాలి. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలివే. కాగా ఉద్యోగంలో చేరిన వారికి... గంటకు 35 పౌండ్ల చొప్పున చెల్లిస్తారు.


ఒక వారంలో కేవలం 20 గంటలు టీవీ చూస్తే చాలు. వారానికి 700 పౌండ్లు(రూ. 65 వేలు) చెల్లిస్తారు. ఈ ఉద్యోగం పేరు... ‘టెక్ టెస్టర్’. ‘ఆన్‌బాయ్’ సంస్థ ఉత్పత్తులైన టీవీలు, కెమేరాలు, హెడ్‌ఫోన్లు, సినిమా సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీ తదితర ఉత్పత్తులను అందిస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఆ సంస్థ ప్రతీ నెలా ఓ ప్రొడక్టును అందిస్తుంది. ఉద్యోగి దాన్ని పరీక్షించి, దాని పనితనం, డిజైన్, లోటుపాట్ల గురించి ఓ సమీక్ష రాసి ఆ సంస్థ సైట్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.


ధరకు తగట్లుగా... ఆ వస్తువు పనిచేస్తుందా లేదా అనేది చెప్పాలి. ఆ ప్రోడక్టు గురించి 200 పదాలతో ఓ రివ్యూ ఇస్తే సరిపోతుంది. ఈ సంస్థ తయారు చేసే వస్తువుల్లో ఎక్కువగా టీవీలే ఉంటాయి. కాబట్టి... వాటిని వారంలో 20 గంటలు వీక్షించి, పరీక్షించి, ఓ రివ్యూ రాస్తే చాలు. 

Updated Date - 2020-06-26T21:02:34+05:30 IST