భార్యతో అబద్ధం చెప్పి, ప్రియురాలితో చక్కర్లు... కరోనాతో విలవిల!
ABN , First Publish Date - 2020-03-19T17:53:58+05:30 IST
బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యకు అబద్ధం చెప్పి మరో మహిళతో ‘వ్యవహారం’ నడిపాడు. ఫలితంగా కరోనా వైరస్‌కు గురై, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
లండన్: బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యకు అబద్ధం చెప్పి మరో మహిళతో ‘వ్యవహారం’ నడిపాడు. ఫలితంగా కరోనా వైరస్‌కు గురై, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 30 ఏళ్ల ఆ వ్యాపారవేత్త బిజినెస్ ట్రిప్ మీద బ్రిటన్ వెళుతున్నానని చెప్పాడు. ప్రస్తుతం కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న అతను ఇంగ్లాండ్‌లోని పబ్లిక్ హెల్త్ కో-ఆర్డినేటర్ ఎదుట అసలు విషయాన్ని వెల్లడించాడు. తాను ఇటలీకి సీక్రెట్ ట్రిప్‌పై వెళ్లిన నేపధ్యంలో ఈ వైరస్‌కు లోనయ్యానని తెలిపాడు. తనకు మరో మహిళతో అఫైర్ ఉందని పేర్కొన్నాడు. అయితే ఆమె పేరు వెల్లడించడానికి నిరాకరించాడు. తనకు కరోనా ఎలా సోకిందన్న విషయం తన భార్యకు కూడా తెలియదని అన్నాడు. ప్రస్తుతం అతను వైద్య చికిత్స పొందుతుండగా, అతని భార్య ఇంటిలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.