అంతరిక్షం నుంచి తుఫాన్ ఎలా ఉంటుందో తెలుసా..?

ABN , First Publish Date - 2020-07-27T23:28:58+05:30 IST

నల్లటి మబ్బులు, కుండపోత వర్షం.. తుఫాన్ అనగానే మనకు ఇవే గుర్తోస్తాయి. అయితే ఇదంతా భూమిపై నుంచి మనం చూసే తుఫాన్‌. మరి అదే తుఫాన్‌ను అంతరిక్షం నుంచి చూస్తే...

అంతరిక్షం నుంచి తుఫాన్ ఎలా ఉంటుందో తెలుసా..?

వాషింగ్టన్: నల్లటి మబ్బులు, కుండపోత వర్షం.. తుఫాన్ అనగానే మనకు ఇవే గుర్తోస్తాయి. అయితే ఇదంతా భూమిపై నుంచి మనం చూసే తుఫాన్‌. మరి అదే తుఫాన్‌ను అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా..? పైఫోటోలో కనిపిస్తోంది అదే. మెక్సికో సమీపంలో ఏర్పడిన హరికేన్ హన్నాకు సంబంధించిన ఫోటో ఇది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి ఆస్ట్రోనాట్ బాబ్ బెహెన్‌కెన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అంతేకాకుండా  తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మెక్సికో గల్స్ ప్రాంతంలో హన్నా తుఫాను బలపడుతున్న నేపథ్యంలో స్పేస్ స్టేషన్‌ నుంచి అది స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే ఫోటో తీశానం’టూ బాబ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ప్రకృతి మాత ఎన్ని వింతలను తనలో ఇముడ్చుకుందో కదా..’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Updated Date - 2020-07-27T23:28:58+05:30 IST