ఒకే ఇంట్లోకి వంద పాములు..!

ABN , First Publish Date - 2020-03-13T16:35:33+05:30 IST

నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గట్టురాయిపాకులలో బుధ, గురువారం ఒకే ఇంట్లోకి...

ఒకే ఇంట్లోకి వంద పాములు..!

తెలకపల్లి: నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గట్టురాయిపాకులలో బుధ, గురువారం ఒకే ఇంట్లోకి వంద పాములు వచ్చిన సంఘటన చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి ఇంటి యజమాని యాతం నిరంజన్, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు రోజులుగా నిరంజన్ ఇంట్లోకి వంద పాము పిల్లలు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కుటుంబ యజమానితో పాటు చుట్టు పక్కల వారు వచ్చి వాటిని చంపారు.


ఎన్నడూ లేని విధంగా ఒకే ఇంట్లోకి ఇన్ని పాములు రావడమేంటని గ్రామంలో చర్చ చోటు చేసుకున్నది. గ్రామంలో ముళ్ల కంపలు, చెత్తాచెదారం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-13T16:35:33+05:30 IST