హత్రస్ నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ ఆటో డ్రైవర్ వింత దీక్ష
ABN , First Publish Date - 2020-10-03T16:40:27+05:30 IST
యూపీలోని హత్రస్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దేశంలోని ప్రజలంతా ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే హర్యానాకు...
హిసార్: యూపీలోని హత్రస్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దేశంలోని ప్రజలంతా ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే హర్యానాకు చెందిన ఒక ఆటో డ్రైవర్ విచిత్ర దీక్ష చేపట్టారు. హిసార్‌లోని ఆర్యానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రాజ్ పాల్ బుమర్... హస్రత్ అత్యాచార ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించేంతవరకూ తాను కాళ్లకు చెప్పులు వేసుకోనని తెలిపారు. తాను మహిళలను అమితంగా గౌరవిస్తానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ కేసులోని నిందితులందరినీ ఉరి తీయాలని డిమాండ్ చేశారు.